: ‘అగ్రిగోల్డ్’ అమ్మకాలకు ప్రత్యేక కమిటీ...రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ప్రకటించిన హైకోర్టు
తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది మధ్య తరగతి ప్రజలను నట్టేట ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం ప్రకటించింది. అధిక వడ్డీల ఆశ చూపి జనం నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన అగ్రిగోల్డ్ మరోమారు మోసానికి పాల్పడకుండా అడ్డుకట్ట వేసింది. కొద్దిసేపటి క్రితం జరిగిన విచారణ సందర్భంగా అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆస్తుల విక్రయాలన్నీ తాను నియమిస్తున్న కమిటీ పర్యవేక్షణలోనే జరగాలని షరతు విధించింది. అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయాల పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ అమ్మకాలతో పాటు డిపాజిటర్లకు సొమ్ము చెల్లింపులను కూడా కమిటీ పర్యవేక్షిస్తుందని ధర్మాసనం వెల్లడించింది.