: మోదీ ప్రసంగాలపై ఈసీ నజర్


ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలను సమీక్షించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోంది. ఆయన ప్రసంగాల్లో ఎక్కడైనా నిబంధనలను అతిక్రమించారా? అన్న కోణంలో సమీక్ష జరగనున్నట్టు అదనపు చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఆర్.లక్ష్మణన్ తెలిపారు. ముంగేర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష జరుగుతుందని తెలిపారు. 'సైతాన్', 'యదువంశీయులు' వంటి పదాలను మోదీ వాడారని ఎన్నికల కమిషన్ కు కొన్ని పార్టీలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు లక్ష్మణన్ వివరించారు. ఎన్నికల సందర్భంగా నేతల ప్రసంగాలను సమీక్షించడం సర్వ సాధారణమేనని, దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News