: రాజధాని శంకుస్థాపనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి: సీఎం చంద్రబాబు


అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలో ఈ ఉదయం అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 13న ప్రతి ఊరి నుంచి మట్టి, నీరు సేకరించి రాజధానికి తీసుకురావాలని చెప్పారు. గ్రామాల నుంచి సేకరించిన మట్టి, నీరుతో స్మారకస్థూపం నిర్మించాలన్నారు. మన రాజధాని, మన మట్టి, నీరు అనే భావం ప్రతి ఒక్కరిలో ఇనుమడింపజేయాలని పేర్కొన్నారు. అమరావతి సంకల్ప జ్యోతి యాత్రలో యువకులు పాలుపంచుకోవాలని సీఎం కోరారు.

  • Loading...

More Telugu News