: 2017 తర్వాత పరుగుల ‘సునామీ’ చూడలేం... రిటైర్మెంట్ ప్రకటించిన ఉసేన్ బోల్ట్
ప్రపంచ స్థాయి ఆథ్లెటిక్స్ మీట్ ఎక్కడ జరిగినా రన్నింగ్ ట్రాక్ పైనే అందరి దృష్టి. ఎందుకంటే రన్నింగ్ ట్రాక్ పై ఎప్పుడెప్పుడు పరుగుల పందెం మొదలవుతుందా? ఎప్పుడెప్పుడు పరుగుల ‘సునామీ’ని చూస్తామా? అని ఒకటే ఆరాటం. ఒక్కసారి పరుగు ప్రారంభమైందంటే సుడిగాలిగా సెకన్ల వ్యవధిలో ఓ స్టార్ కళ్లు మూసి తిరిచేలోగా లక్ష్యం చేరిపోతాడు. అతడే జమైకా స్టార్, స్ప్రింట్ కింగ్ ఉసేన్ బోల్ట్. నిన్నటిదాకా ఆథ్లెటిక్స్ ప్రియులను అలరించిన ఈ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే ఓ మారు ప్రకటించిన తన రిటైర్మెంట్ ను అతడు మరోమారు పునరుద్ఘాటించాడు. 2017లో రియో కేంద్రంగా జరిగే వరల్డ్ ఆథ్లెటిక్స్ తనకు చివరి ఈవెంట్ అని అతడు ప్రకటించాడు.