: ఏపీ కేబినెట్ భేటీ రేపు... అమరావతి శంకుస్థాపనపైనే ప్రధాన చర్చ


నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన సమయం సమీపిస్తోంది. ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా, ఆయన కేబినెట్ సహచరులంతా శంకుస్థాపన ఏర్పాట్లపై దృష్టి సారించారు. విజయవాడలో ప్రతి రోజు ఏదో ఒక శాఖపై సమీక్ష చేస్తున్న చంద్రబాబు రాజధాని శంకుస్థాపనపై ఆయా శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో అట్టహాసంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాన్ని ఎలాంటి చిన్న లోపాలు లేకుండా నిర్వహించాలని చంద్రబాబు చెబుతున్నారు. ఈ క్రమంలో రేపు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో అమరావతి శంకుస్థాపనపైనే ప్రధాన చర్చ జరగనుంది.

  • Loading...

More Telugu News