: ర్యాగింగ్ పై వీరావేశం...కత్తి చేతబట్టి కళాశాలకు వెళ్లిన ‘అనంత’ విద్యార్థి


చదువుకుందామని కళాశాలకెళితే సీనియర్లు ర్యాగింగ్ పేరిట ఆ విద్యార్థిని నానా ఇబ్బందులకు గురి చేశారు. తీవ్ర మనస్తాపంతోనే ఇంటికి వచ్చిన ఆ విద్యార్థి ఆ తర్వాత వీరావేశంతో రగిలిపోయాడు. తనను వేధింపులకు గురి చేసిన సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకున్నాడు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఆ విద్యార్థి కత్తి చేతబట్టి కళాశాలకు వెళ్లాడు. కాస్త ఆలస్యమైతే, ఆ విద్యార్థి సీనియర్లపై దాడి చేసేవాడే. అయితే దీనిపై ముందుగానే సమాచారం అందుకున్న కళాశాల యాజమాన్యం ఆ విద్యార్థిని నిలువరించింది. ర్యాగింగ్ కు పాల్పడ్డ 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలోని ఓ జూనియర్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే కళాశాల పేరును గాని, విద్యార్థి వివరాలు గానీ బహిర్గతం కాలేదు.

  • Loading...

More Telugu News