: ఎక్కడికక్కడ ఆశా వర్కర్ల అరెస్ట్... తెలంగాణవ్యాప్తంగా ఉద్రిక్తత


కనీస వేతనాల కోసం పోరుబాట పట్టిన ఆశా వర్కర్లు తమ డిమాండ్లు నెరవేరేదాకా వినేలా లేరు. ఇప్పటికే నెలకు పైగా నిరసనలతో హోరెత్తించిన ఆశా వర్కర్లు నేడు హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభలో పాల్గొనేందుకు హైదరాబాదుకు నిన్న రాత్రి నుంచే జిల్లాల నుంచి వందలాదిగా బయలుదేరారు. అయితే శాంతిభద్రతల పరిస్థితులను కారణంగా చూపిన పోలీసులు సభకు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా సభ చేపట్టి తీరతామని ఆశా వర్కర్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇందరా పార్కు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించాయి. ఇక జిల్లాల నుంచి బయలుదేరిన ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. వారితో పాటు వారికి సహకరిస్తున్న కార్మిక సంఘాల నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నిర్బంధంపై ఆశా వర్కర్లు, కార్మిక సంఘాల నేతలు పోలీస్ స్టేషన్లలోనే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News