: రుద్రమదేవికి పాజిటివ్ టాక్... థియేటర్ల వద్ద మొదలైన సందడి
పలు అంచనాలతో నేటి తెల్లవారుఝామున బెనిఫిట్ షోల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రం 'రుద్రమదేవి' పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నట్టు సమాచారం. చిత్రం చూసిన వాళ్లు గుణశేఖర్ ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు. చిత్రంలో పలు సర్ ప్రైజ్ లు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో సినిమా మొదలు కాగా, కాకతీయ సామ్రాజ్యాన్ని, రుద్రమ వీరత్వాన్ని గురించి ఇటలీ చరిత్రకారుడు మార్క్ పోలో చెబుతుంటే చిత్రం ప్రధాన కథలోకి వెళుతుంది. గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్ అలరించినట్టు అభిమానులు చెబుతున్నారు. మరికాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లోని వేలాది థియేటర్లలో చిత్రం మార్నింగ్ షో మొదలు కానుండగా, థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.