: నార్కట్ పల్లి సమీపంలో మరో ప్రమాదం... రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
మొన్న జరిగిన ఘోర ప్రమాదాన్ని మరువకముందే అదే ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. ఈ తెల్లవారుఝామున నార్కట్ పల్లి సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్పందించిన స్థానికులు, అధికారుల సాయంతో వారిని చికిత్సల నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.