: బీహార్ లో మహా కూటమిదే విజయం... సీఎన్ఎన్-ఐబీన్ సర్వే వెల్లడి


దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీ, మహా కూటమిల మధ్య దోబూచులాడుతోందా? అంటే, అవుననే అంటున్నాయి సర్వేలు. యాదవుల సామ్రాజ్యంగా చెప్పుకుంటున్న బీహార్ లో కమలం పార్టీదే గెలుపని ఇప్పటికే ‘జీన్యూస్’ సర్వే తేల్చిచెప్పింది. తాజాగా ఆర్జేడీ , జేడీయూ, కాంగ్రెస్ ల కలయికతో ఏర్పడ్డ ‘మహా లౌకిక కూటమి’దే విజయమని సీఎన్ఎన్-ఐబీఎన్-యాక్సిస్ పోల్ సర్వే తేల్చిచెబుతోంది. మొత్తం 243 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో మహా కూటమికి 137 సీట్లు దక్కనున్నాయని తాజా సర్వే వెల్లడించింది. నిన్న వెలువడిన ఈ సర్వేతో విజయం ఎవరిని వరిస్తుందోనన్న విషయంపై భిన్న వాదనలు తెరపైకి వచ్చినట్లైంది.

  • Loading...

More Telugu News