: 'బతుకమ్మ' గుర్తు ఇదే... ఆమోదించిన కేసీఆర్
దసరా సందర్భంగా తెలంగాణలో జరిగే బతుకమ్మ వేడుకలకు అధికారిక ముద్రను కేసీఆర్ ఆమోదించారు. ఓ చెరువు, చెట్లు, పూలు, పచ్చిక నేపథ్యంలో మహిళలు బతుకమ్మ చుట్టూ ఆటాడుతున్నట్టు రూపొందించిన ఈ ముద్రను కేసీఆర్ ఆదేశాల మేరకు సాంస్కృతిక శాఖ తయారు చేయించింది. తెలంగాణ జీవనానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు ఈ నెల 12 నుంచి 20 వరకూ సాగనున్నాయి. మహిళా సాధికారత, ప్రకృతి ఆరాధన, చెరువుల పరిరక్షణ అంశాలను ప్రతిబింబించేలా దీన్ని తయారు చేశామని ప్రభుత్వం వెల్లడించింది.