: ఆఫ్రికా చాంపియన్ పై 'నాకౌట్ పంచ్'... ఒక్క గుద్దుతో ఆసుపత్రికి పంపిన యువ సంచలనం శివ తాపా


వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌ షిప్‌ లో భారత యువ సంచలనం శివ తాపా అరుదైన చరిత్ర సృష్టించాడు. 56 కిలోల విభాగంలో ప్రీ క్వార్టర్స్‌ లో భాగంగా, దక్షిణాఫ్రికా ఛాంపియన్ మహ్మద్ హమౌత్ తో పోటీపడి అతడిని నాకౌట్ చేసిన ఘనత సాధించాడు. తన ఎడం చేత్తో బలంగా గుద్దితే, మహ్మద్ నేలకరిచాడు. అతడిని పరిశీలించిన రిఫరీ, పరిస్థితి విషమించినట్టుందని భావించి వైద్య సిబ్బందిని పిలిపించారు. ఆపై మహ్మద్ 'నాకౌట్' అని ప్రకటించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ లో ఓ బాక్సర్ నాకౌట్ సాధించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి. ఇప్పుడు శివ ప్రదర్శన అద్భుతమని ప్రశంసలు లభిస్తున్నాయి. మరో మ్యాచ్ లో వికాస్ కృష్ణన్ 75 కిలోల విభాగం ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్ గా బరిలోకి దిగిన థామస్ జబ్లాన్‌స్కి (పోలెండ్)పై 2-1తో విజయం సాధించాడు. వీరిద్దరూ తమ తదుపరి మ్యాచ్ లను గెలిస్తే పతకాలు ఖాయం చేసుకుంటారు.

  • Loading...

More Telugu News