: రేణిగుంట రైల్వేస్టేషన్ లో ఎర్రచందనం కూలీల అరెస్టు
9 మంది ఎర్రచందనం కూలీలను రేణిగుంట పోలీసులు ఈ రాత్రి అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకుగాను మొత్తం 40 మంది కూలీలు తమిళనాడు నుంచి రేణిగుంటకు వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న తిరుపతి టాస్క్ ఫోర్స్, రేణిగుంట పట్టణ పోలీసులు రేణిగుంట రైల్వేస్టేషన్ లో దాడి చేశారు. 31 మంది కూలీలు పారిపోగా, 9 మంది కూలీలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కూలీల నుంచి గొడ్డళ్లు, టార్చ్ లైైట్లు, ఆహారపదార్థాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు తెలిపారు.