: అయ్యో... లాస్ట్ టీట్వంటీ రద్దు


మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక శాంతి సిరీస్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నేటి సాయంత్రం ఏడు గంటలకు సౌతాఫ్రికా-భారత్ మధ్య ప్రారంభం కావాల్సిన చివరి టీట్వంటీ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. నేటి మధ్యాహ్నం కోల్ కతాలో కురిసిన భారీ వర్షానికి ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. క్రీజుపై కవర్లు కప్పి ఉంచడంతో పిచ్ బాగానే ఉన్నప్పటికీ స్టేడియంలోని బౌండరీ లైన్ వద్ద చిత్తడిగా తయారైంది. యంత్రాల సాయంతో చిత్తడిని తొలగించేందుకు గ్రౌండ్స్ మన్ శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. మూడుసార్లు స్టేడియంను పరిశీలించిన అంపైర్లు స్టేడియం మ్యాచ్ ఆడేందుకు అనువుగా లేదని పేర్కొంటూ రద్దు చేశారు. దీంతో 2-0 తేడాతో టీట్వంటీ సిరీస్ ను సౌతాఫ్రికా జట్టు గెలుచుకుంది. కాగా, మ్యాచ్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్ కు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

  • Loading...

More Telugu News