: మహిళలు పిడికిలి బిగిస్తేనే విజయం: సీఎం కేసీఆర్
మహిళలు పిడికిలి బిగిస్తే అన్ని విషయాల్లోను విజయం తథ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం నరసన్నపేట గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే చాలా ముఖ్యమన్నారు. వారం రోజుల్లోగా రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలుస్తామన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలను చైతన్యపరిచేందుకు యువత ముందుండాలన్నారు. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని, అంకాపూర్ గ్రామానికి దీటుగా పంటలు సాగు చేయాలని రైతులకు కేసీఆర్ సూచించారు.