: పెయిన్ కిల్లర్స్ వాడేస్తున్నారా?...వాటి స్థానంలో ఇవి ట్రై చేయండి


సాధారణంగా జలుబు, దగ్గు, చిన్న నొప్పులకు మాత్రలు వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలా ప్రతిదానికి మందులు వాడడం కొందరికి ఇష్టం ఉండదు. ఇలా మందుల వాడకం కంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడడం మంచిదని వైద్యులు కూడా చెబుతుంటారు. ఇలా నొప్పుల బారిన పడేవాళ్లు కొన్ని రకాల ఆహార పదార్థాల నుంచి ఉపశమనం పొందచ్చని చెబుతున్నారు. అదేపనిగా కూర్చొని ఉండడం వల్ల వచ్చే నొప్పులకు ద్రాక్షపళ్లు మంచి నివారణిగా పని చేస్తాయి. నడుం నొప్పి బాధిస్తుంటే ఓ కప్పుడు ద్రాక్షపళ్లు తినడం ద్వారా నడుం దగ్గర రక్త ప్రసరణ సరిగ్గా జరిగేలా చూడవచ్చు. దీనివల్ల నడుం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఎక్కువ సేపు ఏదైనా పని చేస్తే కాళ్లు, చేతులు తిమ్మిర్లెక్కడం జరుగుతుంది. అలాంటి వారు పైనాపిల్ ముక్కలు తింటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆర్థరైటిస్ తో బాధపడేవారికి కూడా పైనాపిల్ మంచిదని నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ తినడం ద్వారా పొట్ట తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. పుదీనా కూడా నొప్పులకు మంచి నివారణి అని వారు చెబుతున్నారు. పంటినొప్పి, తల నొప్పి, కండరాల నొప్పులు పుదీనా వాడడం వల్ల పోతాయట. అజీర్ణం, ఉబ్బసం లాంటి సమస్యలకు కూడా పుదీనా దివ్యౌషధమే. చేప నూనె వాడకం ద్వారా నొప్పులు నివారించుకోవచ్చు. చేపనూనె వంటల్లో వాడడం ద్వారా తలనొప్పి, నడుం నొప్పి, కండరాలనొప్పి, కాళ్లు, చేతులు వంకరపోవడం నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి కూడా నొప్పులకు మంచి నివారణి అని నిపుణులు సూచిస్తున్నారు. జాయింట్ పెయిన్స్ ఉంటే వెల్లుల్లి రెబ్బలు తీసుకుని నూనెలో వేయించి, ఆ నూనెను జాయింట్స్ మీద మర్దనా చేస్తే నొప్పులు మాయం అంటున్నారు. ఉదయాన్నే వచ్చే ఎండలో లభించే విటమిన్ డీ కూడా నొప్పుల నివారణి అని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News