: లెక్కలు చెప్పని ఏపీ ప్రభుత్వం: బీజేపీ ఎమ్మెల్సీ మండిపాటు


పోలవరం అథారిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కలు చెప్పడం లేదంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఈరోజు కలిశారు. అనంతరం సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ అంతర్భాగమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులిస్తున్నా ఏపీ ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడం లేదని, కేంద్ర నిధులను బ్యాంకుల్లో పెట్టుకుని వడ్డీలు తింటున్నారంటూ ఆయన ఆరోపించారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు నీరివ్వటం లేదన్నారు. ప్రత్యేకహోదాపై ఏపీకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నారు. కొంచెం ఆలస్మైనంత మాత్రాన ఏపీకి నష్టమేమీ జరగదని వీర్రాజు అన్నారు.

  • Loading...

More Telugu News