: దసరాకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశాం: దక్షిణ మధ్య రైల్వే అధికారులు


తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు 9 ప్రత్యేక రైళ్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్, తిరుపతి, విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12న రాత్రి 10.40 గంటలకు తిరుపతి-విశాఖపట్నం, 17వ తేదీ సాయంత్రం 3.45 గంటలకు తిరుపతి-సికింద్రాబాద్, 25వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు సికింద్రాబాద్-తిరుపతి ప్రత్యేక సూపర్ ఫాస్ట్ రైళ్లు బయలుదేరతాయి. ఈ నెల 13,16 వ తేదీల్లో సాయంత్రం 4.35 గంటలకు విశాఖపట్నం-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈనెల 26న సాయంత్రం 3.55 గంటలకు తిరుపతి నుంచి విశాఖపట్నంకు సూపర్ ఫాస్ట్ రైలు సర్వీసు ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News