: ప్చ్... మ్యాచ్ జరగడం కష్టమే!
మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక శాంతి సిరీస్ లో భాగంగా కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో నేటి సాయంత్రం ఏడు గంటలకు సౌతాఫ్రికా-భారత్ మధ్య ప్రారంభం కావాల్సిన చివరి టీట్వంటీ మ్యాచ్ ను వర్షం అడ్డుకుంది. కోల్ కతాలో నేటి మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఈడెన్ గార్డెన్స్ స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. క్రీజుపై కవర్లు కప్పి ఉంచడంతో పిచ్ బాగానే ఉన్నప్పటికీ స్టేడియంలోని బౌండరీ లైన్ వద్ద ఇంకా చిత్తడిగానే ఉంది. దీంతో రెండు సార్లు స్టేడియంను పరిశీలించిన అంపైర్లు తుది నిర్ణయాన్ని 9:30 నిమిషాలకు తీసుకుంటామని తెలిపారు. దీంతో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. కాగా, మ్యాచ్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్ కు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు.