: గ్రీస్ వీధుల్లో షికార్లు కొడుతున్న డ్రైవర్ లెస్ బస్సు


ఆ బస్సులో డ్రైవరుండడు... అయినా నిక్షేపంగా రోడ్లపై తిరిగేస్తుంది. ఈ ముచ్చట ఇప్పుడు గ్రీస్ లో కనిపిస్తోంది. డ్రైవర్ లెస్ బస్ ప్రస్తుతం అక్కడ చక్కర్లు కొడుతోంది. ఫ్రెంచ్ సంస్థ రూపొందించిన ఈ డ్రైవర్ లెస్ బస్ గ్రీస్ లోని త్రికల నగరంలో తిరుగుతోంది. జీపీఎస్ ఆధారంగా నడిచే ఈ బస్సులో ఆటోమేటిక్ కెమెరాలు ఉంటాయి. కంట్రోల్ సెంటర్ నుంచి బస్సుకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. ఈ సమాచారం ఆధారంగా బస్సు తనను తాను నియంత్రించుకుని నడుస్తుంది. పది మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఈ బస్సును ప్రస్తుతానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. నెల రోజులపాటు బస్సును ఇలా పరీక్షించి, వచ్చే నెల మొదటికి ప్రయాణికులను ఎక్కించుకుని నడుపుతారు.

  • Loading...

More Telugu News