: హార్దిక్ పటేల్ అబద్ధం చెబుతున్నాడు: కోర్టుకి గుజరాత్ పోలీసులు


పటేల్ పాటీదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని న్యాయస్థానానికి గుజరాత్ పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 22న గుజరాత్ లోని ఆరావళి గ్రామంలో బహిరంగ సభ నిర్వహిస్తూ, పోలీసులు వస్తున్నారని పారిపోయిన హార్దిక్ పటేల్ ను గుజరాత్ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ అక్కడి హైకోర్టులో హెబియస్ కార్పస్ కింద కేసు నమోదైంది. ఈ కేసుపై గుజరాత్ హైకోర్టులో విచారణ జరిగింది. హార్దిక్ పటేల్ ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. సెప్టెంబర్ 22న హార్దిక్ ను పోలీసులు కానీ, ఇతర వ్యక్తులు కానీ కిడ్నాప్ చేయలేదని తెలిపారు. అలాగే ఆ రోజు అతని అనుచరులకు అందుబాటులో లేడన్న విషయం వాస్తవం కాదని కూడా అఫిడవిట్ లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News