: పవన, సౌర విద్యుత్ పై దృష్టి పెట్టాం: బాబు
పవన, సౌర విద్యుత్ పై ప్రత్యేకదృష్టి పెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలోని గేట్ వే హోటల్ లో సోలార్ విండ్ డెవలపర్స్ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు. విద్యుత్ లోటు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యుదుత్పత్తికి ప్రత్యామ్నాయాలను నిత్యం అన్వేషిస్తున్నామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. సౌర విద్యుత్ గతంలో యూనిట్ 14 రూపాయలు ఉండేదని, ఇప్పుడు 6 రూపాయలకు వస్తోందని, భవిష్యత్ లో ఇది 3 రూపాయలకు లభ్యమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సౌర, పవన విద్యుత్ వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని, నాణ్యమైన విద్యుత్ అందించగలిగితే సౌర, పవన విద్యుత్ లే శ్రేష్ఠమైనవని ఆయన తెలిపారు.