: ఒబామా.. బ్యాట్ పట్టారు!
అమెరికా అధ్యక్షుడు ఒబామా క్రికెట్ బ్యాట్ పట్టారు. అయితే, ఆయన బ్యాట్ పట్టింది ఆట ఆడేందుకు కాదు.. ప్రచారం చేసేందుకు. వెస్టిండీస్ క్రికెట్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాతో కలిసి ఒబామా ఫొటోలకు పోజిచ్చారు. ఈ ఫొటోలను లారా ట్విట్టర్ లో పోస్టు చేశాడు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘క్రికెట్ దిగ్గజాల ఎగ్జిబిషన్ పోరు’ కు మద్దతుగా ఒబామా బ్యాట్ పట్టాల్సి వచ్చింది. వచ్చే నెల 7,11,14వ తేదీల్లో న్యూయార్క్, హ్యూస్టన్, లాస్ ఏంజిల్స్ నగరాల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.