: ఉత్తరాఖండ్ లోయలో పడ్డ కారు... 9 మంది దుర్మరణం
70 మీటర్ల లోతైన లోయలో కారు పడటంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో జరిగింది. పోక్రి-హాప్లా రహదారిపై వెళ్తుండగా కారు అదుపుతప్పింది. దీంతో కారు లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు మహిళలు సహా తొమ్మిది మంది ప్రాణాలు పోయాయి. మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత శాఖాధికారులు తెలిపారు. మృతులు ఏ రాష్ట్రానికి చెందిన వారనే విషయం తెలియాల్సి ఉంది.