: కోలుకుంటున్న మాజీ క్రికెటర్ సిద్ధూ
కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో, సిద్ధూ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఓ ప్రకటన రూపంలో విడుదల చేశారు. సిద్ధూ క్రమంగా కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఆయనకు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి లేదని చెప్పారు. కేవలం మందుల వల్లే ఆయన కోలుకుంటున్నారని వెల్లడించారు. పంజాబ్ లోని అమృత్ సర్ నియోజకర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఆయన గెలుపొందారు.