: మేడారం జాతరకు ఐదు నెలల ముందే నిధుల కేటాయింపు
వరంగల్ జిల్లాలో వచ్చే ఏడాది జరగనున్న మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే నిధులు కేటాయించింది. జాతర ఏర్పాట్లకు రూ.101 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. ఈ ఏర్పాట్ల కోసం 18 శాఖలు నిర్వహించే పలు రకాల పనులకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. రెండు సంవత్సరాలకొకసారి ఈ జాతర నాలుగు రోజుల పాటు జరుగుతుంది. అయితే జాతర మరో ఐదు నెలల సమయం ఉందనగానే ఇప్పటి నుంచే పనుల నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడం గమనార్హం.