: బీఫ్ వివాదం ...శబరిమలై మతగురువు మనవడిపై దాడి
దేశంలో ఏదో ఒక మూల గోవధ, గోమాంస భక్షణ అంశంపై గొడవ జరుగుతూనే ఉంది. తాజాగా, ఇదే అంశంపై ప్రఖ్యాత శబరిమలై మతగురువు మనవడు రాహుల్ ను చితకబాదారు. అతని కారును ధ్వంసం చేశారు. ఈ ఘటన కేరళలోని అలెప్పీ సమీపంలోని కాయంకులం ఎంఎస్ఎం కాలేజీ ఆవరణలో చోటు చేసుకుంది. రాహుల్ టీవీ విశ్లేషకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో, ఓ జాతీయ మీడియా చర్చలో పాల్గొన్న ఆయన.... బీఫ్ పై నిషేధం విధించడాన్ని సమర్థించారు. దీన్ని వ్యతిరేకించిన కొంత మంది విద్యార్థులు రాహుల్ పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి 15 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.