: నా కొడుకు ఎయిర్ ఫోర్స్ లో చేరుతానంటున్నాడు: సచిన్


అర్జున్ టెండూల్కర్ ఎయిర్ ఫోర్స్ లో చేరుతానని అంటున్నాడని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గౌరవ గ్రూప్ కెప్టెన్ గా కొనసాగుతున్న సచిన్ ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా వైమానిక విన్యాసాలను తిలకించిన అనంతరం మాట్లాడుతూ, అయితే అర్జున్ వైమానిక దళంలో చేరేదీ లేనిదీ స్పష్టంగా చెప్పలేనని అన్నాడు. వాస్తవానికి అర్జున్ ను తీసుకొద్దామని భావించానని, కొన్ని కారణాల వల్ల కుదరలేదని సచిన్ తెలిపాడు. 16 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ ముంబైలో స్కూల్ స్థాయి క్రికెటర్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News