: పిస్టల్ తో కాల్చుకుని పూణే బిల్డర్ ఆత్మహత్య
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పూణేకు చెందిన ఒక ప్రముఖ బిల్డర్ పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాసర్వాదవులీ పోలీసుల కథనం ప్రకారం, కాస్మోస్ గ్రూప్ చైర్ పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సూరజ్ రమేష్ పర్మార్(45) తన వ్యక్తిగత .32 క్యాలిబర్ పిస్టల్ తో కాల్చుకుని నిన్న మధ్యాహ్నం మృతి చెందాడు. ఈ సంఘటన జరిగినప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించి కాసర్వాదవులీ నిర్మించిన నమూనా బంగళాలో ఆయన ఉన్నాడు. మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీ(ఎంసీహెచ్ఐ), ధానేకు అధ్యక్షుడిగా కూడా ఆయన ఉన్నారు. ఆయనపై అధికార జాప్యం, రుణాలు చెల్లింపులు సకాలంలో జరగకపోవడం వంటి ఆరోపణలు ఉండటంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. 15 పేజీల సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పర్మార్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.