: దాద్రి ఘటనకు, ముజఫర్ నగర్ ఘటనకు లింకుంది
ఉత్తరప్రదేశ్ లో దాద్రి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో ప్రధాన నిందితులు గతంలో ముజఫర్ నగర్ అల్లర్ల నిందితులని సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తెలిపారు. లక్నోలో ఆయన మాట్లాడుతూ, దాద్రి ఘటనకు పాల్పడిన వారిని వదలమని తెలిపారు. ఇందువల్ల తమ ప్రభుత్వం పడిపోయినా లెక్కచేయమని ఆయన స్పష్టం చేశారు. దాద్రిలో గోమాంసం తిన్నాడన్న కారణంతో మహ్మద్ అఖ్లాఖ్ (50) అనే వ్యక్తిని హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికి ఏడుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా స్థానిక బీజేపీ నేత అనుచరులు, వారిలో ఆ నేత కుమారుడు కూడా ఉండడం విశేషం.