: భార్యను చంపి, పూడ్చేసిన జగన్ వ్యక్తిగత కెమెరామెన్ ?


వైకాపా అధినేత జగన్ వ్యక్తిగత కెమెరామెన్ వంశీ కట్టుకున్న భార్యనే చంపేసి, పూడ్చేశాడు. ఈ ఘాతుకంలో వంశీ తల్లిదండ్రులు కూడా పాలుపంచుకున్నారు. మృతురాలి పేరు వరలక్ష్మి. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బర్రంకులలో ఈ దారుణం చోటు చేసుకుంది. మూడు నెలల క్రితమే ఈ ఘాతుకం జరిగింది. కాల్వ పక్కన వరలక్ష్మి మృతదేహాన్ని పాతిపెట్టి... తన భార్య అదృశ్యమయిందని గతంలో విజయవాడలోని నాగాయలంక పోలీస్ స్టేషన్ లో వంశీ ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, వరలక్ష్మి కోసం కుటుంబ సభ్యులంతా ఎంతో వెతికారు. తమ కుమార్తె కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు హెచ్చార్సీని కూడా ఆశ్రయించారు. పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కృష్ణా జిల్లా ఎస్పీని హెచ్చార్సీ ఆదేశించింది. వంశీ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉంచితే, వంశీ తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఆమెను హత్య చేసినట్టు అంగీకరించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాలలోను విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News