: అక్రమంగా తరలిస్తున్న నక్షత్ర తాబేళ్లు స్వాధీనం
నక్షత్ర తాబేళ్లను బ్యాగ్ లో పెట్టి తరలిస్తున్న ఒక వ్యక్తిని చెన్నై విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఈ సంఘటన వివరాలు...మలేషియాలోని కౌలాలంపూర్ వెళ్తున్న తమీమ్(28) అనే వ్యక్తి సుమారు 150 నక్షత్ర తాబేళ్లను బ్యాగులో పెట్టి తరలిస్తున్నాడు. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారులు రంగంలోకి దిగి ఆ తాబేళ్ల బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, తాబేళ్లలో అరుదైన రకానికి చెందిన నక్షత్ర తాబేళ్లకు మంచి డిమాండ్ ఉంది.