: రైతుల ఆత్మహత్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా?: తెలంగాణ ప్రభుత్వానికి 'రైతు జేఏసీ' సవాల్


రైతు ఆత్మహత్యలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని తెలంగాణా ప్రభుత్వానికి తెలంగాణ రైతు జేఏసీ అధ్యక్షుడు, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ సవాలు విసిరారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పరామర్శించి ఉంటే వాస్తవాలు తెలిసి ఉండేవని అన్నారు. రైతు ఆత్మహత్యలను అపహాస్యం చేసిన ప్రభుత్వాలు నిలబడవని ఆయన హెచ్చరించారు. రైతు ఆత్మహత్యలపై ప్రజాసంఘాలు, మేధావుల సలహాలను ప్రభుత్వం తీసుకోవాలని ఆయన సూచించారు. రైతు రుణమాఫీ ఒకేసారి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎల్లుండి చేపట్టనున్న తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News