: భారత వాయుసేన ఉత్సవాలకు హాజరైన సచిన్ టెండూల్కర్
క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ భారత వాయుసేన 83వ వార్షికోత్సవాలకు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఉన్న హిందోన్ ఎయిర్ బేస్ లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వాయుసేన అధికారులతో కలసి కలివిడిగా తిరిగిన సచిన్... వైమానిక ప్రదర్శనను వీక్షించారు. అనంతరం ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ, "ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంకితభావానికి గర్విస్తున్నా. ప్రతి ఒక్క ఉద్యోగి ఎంతో అంకితభావంతో పనిచేస్తున్నారు. వారందరి గురించి మనం ఆలోచించాలి" అంటూ ట్వీట్ చేశారు. మరో విషయం ఏమిటంటే, భారత వాయుసేన గౌరవ గ్రూప్ కెప్టెన్ గా కూడా సచిన్ వ్యవహరిస్తున్నారు.