: ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు!
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసివున్న కనకదుర్గమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సంవత్సరం నుంచి నవరాత్రి ఉత్సవాలకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరించనుంది. దుర్గమ్మ గుడిని మరింతగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. ప్రతియేటా దసరా పర్వదినాల్లో భాగంగా దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అలంకరిస్తూ, ఉత్సవాలు జరుపుతారన్న సంగతి తెలిసిందే. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఆషాడ మాసంలో వచ్చే బోనాల పండగను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించి కోట్ల రూపాయల నిధులను కేటాయించి వాటిని విజయవంతం చేసింది.