: ఏపీలో 31 'అమృత్' పట్టణాలు... నిధులివ్వాలని కేంద్రాన్ని కోరిన ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ లో 31 పట్టణాలను అమృత్ పథకం కింద అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఐదు సంవత్సరాలకు గాను రూ.28,756 కోట్లు కేటాయించాలని తెలిపింది. 2015-16 సంవత్సరానికి రూ.673 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అంగీకరించింది. ఏపీ కోరినట్టుగా రూ.673 కోట్లను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News