: రెహమాన్ కు హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ ను మరో పురస్కారం వరించింది. బాలీవుడ్ దర్శకనిర్మాత సుభాష్ ఘయ్ ఏర్పాటు చేసిన 'హృదయనాథ్ మంగేష్కర్ అవార్డ్'కు ఆయన ఎంపికయ్యారు. ప్రఖ్యాత గాయకురాలు లతా మంగేష్కర్, ఆశాభోంస్లేల సోదరుడే హృదయనాథ్ మంగేష్కర్. ఆయన పేరుమీదే అవార్డును ప్రతి ఏటా ఇస్తున్నారు. ఈ సంవత్సరానికి రహమాన్ ను ఎంపిక చేశారు. ఇప్పటివరకు లతా మంగేష్కర్, ఆశాభోంస్లే, అమితాబ్ బచ్చన్, సులోచన టయ్ లకు ఈ అవార్డును ప్రదానం చేశారు.