: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం
హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత కమిటీలు, నామినేటెడ్ పదవులపై చర్చించనున్నారు. మంత్రివర్గమార్పుపై కూడా ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని తెలుస్తోంది. త్వరలో తెలంగాణలో రెండు స్థానాల్లో (వరంగల్, నారాయణఖేడ్) జరగనున్న ఉపఎన్నికలపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేస్తారు.