: విపక్షాలపై సీఎం ఫిర్యాదు చేయడం శోచనీయం: కిషన్ రెడ్డి
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో విపక్షాల తీరుపై సీఎం కేసీఆర్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో సమస్యలపై చర్చించకుండా విపక్షాలను సస్పెండ్ చేశారని విమర్శించారు. విపక్షాలపై గవర్నర్ కు సీఎం ఫిర్యాదు చేయటం శోచనీయమన్నారు. అధికార పక్షమే తప్పు చేసి... విపక్షాలపై ఫిర్యాదు చేస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. బంద్ లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని కిషన్ రెడ్డి కోరారు.