: ఇండియాలో వోక్స్ వ్యాగన్ 'పోలో' అమ్మకాల నిలిపివేత


వోక్స్ వ్యాగన్ ఇండియాలో మార్కెటింగ్ చేస్తున్న పాప్యులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ 'పోలో' అమ్మకాలు నిలిచిపోయాయి. ఈ కారు విక్రయాలను తక్షణం నిలిపివేయాలని, ముందుగా బుక్ చేసుకున్న వారెవరికీ డెలివరీలు చేయవద్దని వోక్స్ వ్యాగన్ సంస్థ నుంచి డీలర్లందరికీ సమాచారం అందింది. పోలో వేరియంట్ లోని అన్ని వాహనాల డెలివరీలనూ తక్షణమే నిలిపివేయాలని తమకు ఆదేశాలు అందినట్టు ఓ డీలర్ వెల్లడించారు. ఈ మేరకు సంస్థ ఆఫ్టర్ సేల్స్ ఆపరేషన్స్ విభాగం హెడ్ ఆశిష్ గుప్తా, సేల్స్ విభాగం హెడ్ పంకజ్ శర్మల సంతకాలతో కూడిన లేఖలు అందాయని, అయితే ఇది తాత్కాలికమే కావచ్చని డీలర్లు వివరించారు.

  • Loading...

More Telugu News