: ‘అనంత’ కష్టాలు తీరినట్టే!... హంద్రీనీవాకు నీటిని విడుదల చేసిన కేఈ, దేవినేని


సాగునీటికే కాక తాగునీటికీ అష్టకష్టాలు పడుతున్న అనంతపురం జిల్లా వాసుల వెతలు తీరినట్టే. ఎడారి జిల్లాగా పేరుపడ్డ అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు టీడీపీ సర్కారు నీటిని విడుదల చేసింది. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి జలాశయం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు కొద్దిసేపటి క్రితం హంద్రీనీవా కాలువలోకి నీటిని విడుదల చేశారు. హంద్రీనీవా నీటితో అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున బీడు భూములు సాగు భూములుగా మారనున్నాయి.

  • Loading...

More Telugu News