: ఇకపై యుద్ధరంగంలోనూ కదం తొక్కనున్న మహిళలు


భారతీయ మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. ఇకపై, అత్యంత కీలకమైన యుద్ధరంగంలో కూడా వారు సత్తా చాటబోతున్నారు. భారత వైమానిక దళంలో యుద్ధవిమానాల పైలెట్లుగా మహిళలను నియమించబోతున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రహా ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఆసక్తి ఉన్న మహిళలను ఫైటర్ పైలట్లుగా చేయాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. ఇప్పటిదాకా రవాణా విమానాలు, హెలికాప్టర్ పైలెట్లుగా మాత్రమే మహిళలు సేవలందిస్తున్నారు. దాదాపు 300 మంది మహిళా పైలట్లు భారత వైమానిక దళంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News