: ఈ నెల 10న తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన విపక్షాలు
ఈ నెల 10న తెలంగాణ రాష్ట్ర బంద్ కు విపక్షాలు పిలుపునిచ్చాయి. రైతుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ఈ బంద్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు శాసనసభ ఆవరణలో విపక్ష నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు సమావేశమై బంద్ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, నెలాఖరులోగా రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వానికి చెబితే సరిగా స్పందించకుండా తమను సభ నుంచి గెంటేశారని ఆరోపించారు.