: కాల్ సెంటర్ పేరుతో మోసగిస్తున్న ఢిల్లీ ముఠా అరెస్టు
కాల్ సెంటర్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఢిల్లీకి చెందిన ముఠాను హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో మొత్తం 14 మంది సభ్యులున్నారు. ప్రైజ్ మనీ వచ్చిందంటూ పలువురికి ఫోన్ చేసి డబ్బులు గుంజుతున్నారని, అలా ఇంతవరకు రూ.4 కోట్లకు పైగా మోసాలకు పాల్పడ్డట్లు తెలిసింది. గుర్ గావ్ కేంద్రంగా వారంతా తమ కార్యకలాపాలను నడుపుతున్నారని పోలీసులు చెప్పారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.