: అబద్ధాల పోటీ పెడితే చంద్రబాబుకే మొదటి ర్యాంక్ వస్తుంది: లక్ష్మీపార్వతి


ఏపీ సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు లక్ష్మీపార్వతి ఎప్పటిలాగే విమర్శలు చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడులో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష వేదికకు ఈరోజు ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అబద్ధాల పోటీ పెడితే చంద్రబాబే తొలి స్థానంలో నిలుస్తారని ఆరోపించారు. అబద్ధాల్లో గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కుతారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై జగన్ చేస్తున్న దీక్షకు అనూహ్య మద్దతు లభిస్తోందని అన్నారు. ఇంత భారీ సంఖ్యలో జనం తరలిరావడం సంతోషకరమైన విషయమని చెప్పారు. జగన్ చేస్తున్న దీక్ష ప్రజలకే కాకుండా, రైతులకు కూడా ఓ ధైర్యం అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News