: పొరపాటు జరిగింది... చింతిస్తున్నాం: ఒబామా
ఆఫ్ఘనిస్థాన్ పౌరులకు అమెరికా అధ్యక్షుడు ఒబామా క్షమాపణలు చెప్పారు. తాలిబాన్ ఉగ్రవాదులపై దాడి సందర్భంగా, అమెరికా దళాలు ఓ ఆసుపత్రిపై దాడులు జరిపాయి. ఈ ఘటనలో కనీసం 22 మంది దుర్మరణం పాలయ్యారు. దాడుల్లో అమాయకులు చనిపోవడంపై అనేకమంది నిరసన వ్యక్తం చేశారు. దీంతో, అగ్రరాజ్య అధ్యక్షుడు స్పందించారు. పొరపాటున ఈ ఘటన జరిగిందని, దీనికి ఎంతో చింతిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కావని హామీ ఇచ్చారు. 'డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్' సంస్థ ప్రతినిధులతో ఫోన్ లో మాట్లాడిన ఒబామా... జరిగిన ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీంతోపాటు, మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.