: ముంబైకి తరలిన బీసీసీఐ గల్లా పెట్టె... ఆడిటర్లనూ మార్చేసిన శశాంక్


నిన్నటిదాకా శ్రీనివాసన్ సొంతూరు చెన్నైలో ఉన్న బీసీసీఐ ‘గల్లా పెట్టె’(ట్రెజరీ), బీసీసీఐ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆగమనంతో, ఇప్పుడు ముంబైకి తరలివెళ్లిపోయింది. అలాగే, సంస్థ ఆడిటింగ్ బాధ్యతలకు కూడా చెన్నైవాసులు వద్దని నిర్ణయించుకున్నట్టుంది. అంతే, ఆడిటర్లు కూడా మారిపోయారు. ఈ రెండు విషయాలు నిన్న చకచకా జరిగిపోయాయి. ఆడిటింగ్ లో విశేష అనుభవం గడించిన ముంబై ఆడిటింగ్ సంస్థ ‘గోఖలే, సాథే’ కంపెనీ ఇకపై తమ లెక్కాపద్దులను పర్యవేక్షిస్తుందని బీసీసీఐ ప్రకటించింది. నిన్నటిదాకా బోర్డు ఆడిటర్ గా వ్యవహరించిన ఫరమ్ (చెన్నై ఆడిటర్) సేవలను రద్దు చేస్తున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది.‘‘బోర్డుకు సంబంధించిన అన్ని పన్నుల విషయాలు ముంబై ఆదాయపన్ను శాఖ పరిధిలోనే జరగాలి. అందుకే ట్రెజరీని ముంబైకి తరలిస్తున్నాం’’ అని బోర్డు నిన్న ప్రకటించింది.

  • Loading...

More Telugu News