: పరువు కోసం టీమిండియా.... క్లీన్ స్వీప్ కోసం సఫారీలు: నేడే చివరి టీ20
‘ఫ్రీడమ్ సిరీస్’లో భాగంగా ఇప్పటికే టీ20 టైటిల్ ను టీమిండియా జారవిడిచింది. సొంత గడ్డపై అందివచ్చిన అవకాశాన్ని ధోనీ సేన అందిపుచ్చుకోలేకపోయింది. తొలి మ్యాచ్ ను చేజేతులా వదిలివేయగా, రెండో మ్యాచ్ లో సఫారీలు వీరవిహరం చేశారు. దీంతో మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంకో మ్యాచ్ మిగిలుండగానే సఫారీలు టీ20 కప్ ను గెలిచేశారు. నేడు చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా కనీసం పరువునైనా కాపాడుకునేందుకు టీమిండియా యత్నిస్తోంది. అయితే ఇప్పటికే రెండు మ్యాచ్ ల విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న సఫారీ జట్టు ఈ మ్యాచ్ లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ సాధించాలని పథకం రచిస్తోంది. మరి టీమిండియా పరువు నిలుస్తుందో, సఫారీ ప్లాన్ సక్సెస్ అవుతుందో చూడాలి.