: భారత్ లో ప్రియాంకా చోప్రా ప్రమాదకరం...ఇంటర్నెట్ నిపుణుల హెచ్చరిక!
భారత్ లో ప్రియాంకా చోప్రా అత్యంత ప్రమాదకారి అని ఇంటర్నెట్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ లో ప్రియాంకా చోప్రా పేరుతో సెర్చ్ చేస్తే మీరు బుక్కైపోయినట్టేనని సాక్షాత్తూ ఇంటెల్ సంస్థ పేర్కోవడం విశేషం. ప్రియాంకా చోప్రా పేరుతో సెర్చ్ చేసినప్పుడు చాలా వెబ్ పేజ్ లు ఓపెన్ అవుతున్నాయని వాటిల్లో వైరస్ లు ఉంటున్నాయని వారు తెలిపారు. ప్రియాంక చోప్రా పేరుతో ఒపెన్ చేయగానే, ఎంపీ4 డౌన్ లోడ్ చేయాలంటూ అటాచ్ మెంట్ పేజ్ ఓపెన్ అవుతుందని, దాని ద్వారా హ్యాకర్లు మన కంప్యూటర్ లో చేరి, వినియోగదారుడికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇంటర్నెట్, బ్యాంకింగ్ పాస్ వర్డ్ లు దొంగిలిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. గతంలో అలియా భట్ అత్యంత ప్రమాదకరంగా ఉంటే, ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రియాంక చోప్రా ఆక్రమించిందని వారు తెలిపారు. శ్రద్ధా కపూర్, కపిల్ శర్మ, సినీ నటుల బ్రేకప్, సినిమా వివరాలు అంటూ సోషల్ మీడియాలో హ్యాకర్లు పోస్టులు పెట్టి వైరస్ ను చొప్పిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. కనుక డౌన్ లోడ్ చేసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు వినియోగదారులకు సూచిస్తున్నారు.