: సెషెల్స్ సాంస్కృతిక ప్రచారకర్తగా ఏఆర్ రెహ్మాన్ నియామకం
సెషెల్స్ దేశ సాంస్కృతిక ప్రచారకర్తగా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ ను ఆ దేశ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సెషెల్స్ అధికారుల నుంచి ఆయనకు ధ్రువపత్రం అందింది. ఈ సందర్భంగా రెహ్మాన్ ట్విట్టర్ ద్వారా సెషెల్స్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు కృతఙ్ఞతలు తెలిపారు. కాగా, ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలకు తన సంగీతాన్ని అందించి ప్రేక్షకులను మైమరపించిన రెహ్మాన్ సంగీత ప్రస్థానం అందరికీ తెలిసిందే. ఎన్నో అవార్డులు, రివార్డులను రెహ్మాన్ సొంతం చేసుకున్నారు.